
మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలంలో డిఎస్ రెడ్యా నాయక్ పల్లె పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో చిన్న గూడూరు మండల పరిదిలోని పగిడి పల్లి,గుండంరాజు పల్లి గ్రామ పంచాయితీ పరిధిలో విస్తృతంగా తిరిగి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకు స్థాపనలు,ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్.అలాగే మండలంలోని పలు గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు.గుండంరాజు పల్లిలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు కొబ్బరికాయ కోట్టి ప్రారంభోత్సవం చేశారు.అనంతరం గుండంరాజు పల్లిలో ఏర్పాటు చేసిన సభా వేదికలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్ హాయంలో పల్లెలన్నీ నూతన శోభతో వెలుగొందుతున్నాయని,రాష్ట్రంలో గత ప్రభుత్వాల పాలనలో అత్త వస్తే అల్లుడు ఇంట్లో లేకుండా బైట తిరగవలసి పరిస్థితని,అలాంటి సమస్యలకు పరిష్కారమే డబుల్ బెడ్రూంల పథకమని,రెండు బెడ్రూంలు,ఒక కిచెన్,ఒక హాలుతో ఒక ధనవంతుడు ఇల్లు ఎలా నిర్మించుకుంటారో అలాంటి ఇండ్లు పేదలకు కట్టి ఇస్తున్న ప్రభుత్వం బిఅర్ఎస్ ప్రభుత్వమని గుర్తు చేశారు.అలాగే నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు డబుల్ బెడ్రూంలు ఇచ్చినామని,అలాగే ఎన్నో పథకాలు పేట్టి పేదరిక నిర్మూలనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు.అలాగే మన నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి,ప్రతి తండాకు రోడ్లు వేసుకున్నామని, నియోజకవర్గంలో మరెక్కడా లేని విధంగా అభివృద్ధి చేసుకున్నది మీ కండ్ల ముందు ఉన్నదని,ఇన్ని రకాల అభివృద్ధి చేసిన మాకు ఓటు అడిగే హక్కు లేదా అని ప్రజలను అడిగిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్.రైతులకు 24గంటలు రైతుకు ఎన్ని మోటార్లు ఉంటే అన్ని మోటర్లకు ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం బిఅర్ఎస్ ప్రభుత్వమని అన్నారు.అలాగే రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేసినది మా ప్రభుత్వమే అని గుర్తు చేశారు.రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో రాష్టం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళుతోందన్నారు.పేదరిక నిర్మూలనకు సీఎం కేసీఆర్ రాష్టంలో ఎన్నో ప్రభుత్వ పథకాలు పెట్టినారని,ఒంటరి మహిళలకు,వికలాంగులకు,వృద్దులకు పింఛన్లు ఇస్తున్నారని అన్నారు.అలాగే రైతులకు రైతు భీమా,రైతు బంధు,24గంటలు ఉచిత కరెంట్,కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిచ్చి మూడు కార్లు పంటలు పండించుకునెలా నీటిని అందిస్తూ రైతును రాజును చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.అలాగే పేద వారి ఇంటిలో పెండ్లి జరిగితే పెద్దన్నలా,కల్యాణలక్ష్మి,శాధిముభారాఖ్ పథకంతో లక్ష నూట పదహార్లు ఇస్తూన్నది నిజమా కాదా అని అడిగారు.అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేసుకుంటే ఆడబిడ్డకు జన్మనిస్తే పదమూడు వెయిల రూపాయలు,మగబిడ్డకు జన్మనిస్తే పన్నెండు వేయిల రూపాయలు ఇస్తూ,కేసీఆర్ కిట్టు ఇస్తూ,కిట్టులో పాపకు కావలసిన వస్తువులతో కూడిన ప్యాకేజీతో ఇస్తున్నారని గుర్తుచేశారు.అలాగే యాదవులకు గొర్రెలు ఇచ్చి యాదవుల అభివృద్ధికి తోడ్పాటు అందించారని,అలాగే ముస్లిం మైనార్టీలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నది కూడా మన బిఅర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.కుల మతాలకతీతంగా రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో చిన్న గూడూరు జెడ్పీటీసీ మూల సునీత మురళీధర్ రెడ్డి,ఎంపీపీ పద్మ వెంకట్ రెడ్డి,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మంగపతి రావు,చిన్న గూడూరు మండల బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రాంసింగ్,మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీ లు,ఎస్టీ సెల్ అధ్యక్షులు,ఎస్సీ సెల్ అధ్యక్షులు,బిసి సెల్ అధ్యక్షులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,మండలంలోని అన్ని గ్రామాల యూత్ అధ్యక్షులు,సోషల్ మీడియా ఇంచార్జులు,మహిళా మండల అధ్యక్షురాలు నీరుప,మహిళా సంఘాలు,మండల బిఅర్ఎస్ పార్టీ,నాయకులు,కార్యకర్తలు,ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.