
ఈ69న్యూస్ హనుమకొండ: ఐనవోలు మండల కేంద్రానికి చెందిన పైండ్ల అనిత తండ్రి పైండ్ల సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు లోనైన అనిత కుటుంబం ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటోంది.ఈ వార్త తెలుసుకున్న అనితతో కలిసి చదువుకున్న మిత్రులు తనకు అండగా నిలిచారు.అనితను పరామర్శించేందుకు నోముల శేఖర్,దినేష్ గౌడ్,రాజు,రాజేష్,మమత,మహేశ్వరి,వీరేష్,రఘు,కడ్డూరి రాజు తదితరులు ఆమె ఇంటికి వెళ్లి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.అంతేకాకుండా,వారు స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.