
రైతులెవ్వరు అధైర్య పడొద్దు యాసంగిలో పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది…ఎమ్మెల్యే డా.రాజయ్య
గాలిగుట్టతండ వద్ద నూతన బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేసిన…ఎమ్మెల్యే డా.రాజయ్య
ఈ రోజు…స్టేషన్ ఘనుపూర్ మండలం , తాటికొండ గ్రామం లో ఐకెపి మహిళ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే యాసంగి ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ చల్లా ఉమాదేవి-సుధీర్ రెడ్డి గారి అధ్యక్షతన తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రివర్యులు , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారు ముఖ్య అతిథిగా లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం గాలిగుట్టతండా వద్ద సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఎటునాగారం ద్వారా ఎస్టి ఎస్డిఎఫ్ నిధుల నుండి కోటి రూపాయల అంచనా వ్యయంతో పిఆర్ రోడ్డు నుండి గాలిగుట్టతండా వరకు నూతన బీటీ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే డా. రాజయ్య గారు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…ఏ-గ్రేడ్ వరి రకానికి 2060 /- , సాధారణ వరి రకానికి 2040 /- రూపాలుగా కొనుగోలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గారు తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు దాన్యం తీసుకువచ్చే ముందరనే రైతులు మంచిగా ఆరబెట్టుకొని ఫేమశాతం 17% ఉండే విధంగా చూసుకొని తీసుకురావాలని రైతులకు సూచించారు
ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు అని భావించిన రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల పక్షపాతిగా రైతును రాజును చేయాలని అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడని తెలిపారు.
రైతులకు సాగునీరు అందించడం కోసం సాగునీటి రంగానికి ప్రాధాన్యతనిస్తూ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి , పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు , సీతారామ ప్రాజెక్టు , ఎస్సారెస్పీ పునర్జీవ పథకం , అదేవిధంగా
85 వేల కోట్ల రూపాయలు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ఎడారిగా ఉన్న తెలంగాణ సస్యశ్యామలం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని తెలిపారు.
మన ముఖ్యమంత్రి కేసిఆర్ గారు స్వయంగా రైతు , అందులో మనసున్న మహారాజు , రైతుల పక్షపాతి , రైతుల పాలిట దేవుడు , రైతు బాంధవుడు కావున రైతుల కోసం అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు. కావున తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం దిగుబడి అధికంగా ఉందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఈ యాసంగిలో పండించిన ధాన్యాన్ని మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కెసిఆర్ గారు భరోసా ఇవ్వడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కూడా ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం కూడా ఆఖరు గింజ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ గారు తెలపడం జరిగిందన్నారు.
భారతదేశ చరిత్రలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రం ఇంతకు ముందు పంజాబ్ ఉండేడిది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో సాగునీటి రంగానికి పెద్దపీట వేసి , అధిక ప్రాధాన్యతనిచ్చి అనేక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి వ్యవసాయానికి అనుకూలంగా సాగునీరు అందడంతో తెలంగాణ రాష్ట్రంలో అధికంగా వరి సాగుచేయబడి , అత్యధిక వరి ఉత్పత్తి చేయబడుతున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో రిజర్వాయర్లోకి మీరు ఫుల్ గా చేరి ఉండటం అదేవిధంగా దేవాదుల ద్వారా కాలువల నిర్మాణం తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా నాలుగు శాతం అటవీ విస్తీర్ణం పెంచుకొని తెలంగాణలో సాధారణ వర్షపాతం 760 మిల్లీమీటర్ల నుండి ఈరోజు తెలంగాణలో వర్షపాతం 933 మిల్లీమీటర్లుగా నమోదు అయిందని తెలిపారు. తద్వారా చెరువుల్లో కుంటల్లో నీరు సమృద్ధిగా రావడం గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ పెరిగి బావుల్లో , బోరు బావుల్లో నీరు సమృద్ధిగా రావడం వల్ల ఈ రోజు వరి అత్యధిక ఎకరాల్లో పంట పండించడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ రైతులు యాసంగిలో పండించే మొత్తం ధాన్యాన్ని ప్రతిగింజ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొంటది.!
మద్దతు ధరకే రాష్ట్ర ప్రభుత్వం కొంటది రైతులు ఎవ్వరూ కూడా ఆందోళన చెంది తక్కువ ధరకు అమ్ముకోవద్దని సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రైతన్నలకు బరోసానిచ్చారు.