jangoan news telugu galam news local news e69news
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తిమ్మంపేట గ్రామ శివారులో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లో గుర్తు తెలియని వ్యక్తులు కాపర్ వైర్లు చోరీ చేశారు.గ్రామానికి చెందిన మంద మల్లేష్ ఉదయం 6.30 గంటలకు వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్లగా బోరు మోటర్ నడవకపోవడంతో అతను ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి చూడగా పైకప్పు విప్పేసి ఉన్నట్లు గమనించి ట్రాన్స్ ఫార్మర్ ను చూశాడు.వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా లైన్ మెన్ కుమారస్వామి వచ్చి పరిశీలించి పై అధికారులకు సమాచారం ఇచ్చారు.విషయం తెలుసుకున్న సహాయ ఇంజనీర్ విశ్వ సాహితి అక్కడికి చేరుకొని ట్రాన్స్ ఫార్మర్ ను పరిశీలించారు.బాధితుడు పోలీస్ స్టేషన్ లో మరియు సహాయ ఇంజనీర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.అసిస్టెంట్ లైన్ మెన్ ఉపేందర్ పాల్గొన్నారు.