
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్ వెంకన్న ఘనపూర్ డివిజన్ పరిధిలోని శివునిపల్లి గ్రామ తెలంగాణ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం పదవ తరగతి విద్యార్థినిలకు హాల్ టికెట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థుల పరీక్షల విషయంలో ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ఆత్మ స్థైర్యంతో పరీక్షలు వ్రాసి ఉత్తమ మార్కులు సాధించి డివిజన్ కు మరియు తల్లి తండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.ఈ సందర్భంగా 50 మంది విద్యార్థినిలకు పరీక్ష ప్యాడ్స్ డొనేట్ చేయడం జరిగింది.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. రాజు మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయిని విద్యార్థులు పాల్గొన్నారు.