
తెలంగాణ ప్రజల పోరు గొంతుక గద్దర్
తెలంగాణ ప్రజల పోరు గొంతుక గద్దర్ అని, ఆయన మరణంతో ప్రజా గొంతుక నేడు మూగబోయిందని మునగాల సొసైటీ చైర్మన్ కందిబండ సత్యనారాయణ అన్నారు, సోమవారం మండల కేంద్రంలోని స్థానిక చిల్లంచర్ల రఘునాథం స్మారక విజ్ఞాన కేంద్రం నందు. సిపిఐ మండల కార్యదర్శి కామ్రేడ్ చిల్లంచర్ల ప్రభాకర్ అధ్యక్షతన. ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకులు, రచయిత గద్దర్ సంతాప సభను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మొదట గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మౌనం పాటించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా గాయకుడు గద్దర్ తన మాట, పాట రచనలతో సమాజంలో చైతన్యం తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ప్రశ్నించే తత్వం అలవాటు చేశారని, ఆయన పాటలు కాలక్షేపం కోసం కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికను పోషించాయి అని ఆయన అన్నారు. అలాగే ఆయన రాసిన పాటలు ప్రతి ఒక్కరి నాలుకలపై ఎప్పటికీ సజీవమే అని, ఆయన లేకపోయినప్పటికీ ఆయన సాహిత్యం సమాజంలో సజీవంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఎలక నరేందర్ రెడ్డి, కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ అర్వపల్లి శంకర్, సిపిఐ జిల్లా నాయకులు సిహెచ్ సీతారాం, సిపిఐ మండల సహాయ కార్యదర్శి మామిడి చిన్న రాములు, సిపిఐ పట్టణ కార్యదర్శి జక్కుల వీరశేఖర్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి సారెడ్డి రాఘవరెడ్డి, సిఐటియు మండల కన్వీనర్ బచ్చల కూరి స్వరాజ్యం, నరగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.