
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన లెల్లెల.బాలకృష్ణ పాల్గొని మాట్లాడుతూ. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కోటి మంది ప్రజలకు, నగరానికి వచ్చే పర్యాటకులకు పోషక విలువలు కలిగిన చేపల వంటకాలు అందించడానికి ప్రతి టూరిజం కేంద్రాలలో ఫిష్ ఫుడ్ కోట్లను ఏర్పాటు చేయాలని, ప్రతి కార్పొరేషన్ డివిజన్ లో రిటైల్ చేపల మార్కెట్లు నిర్మించాలని, అలాగే మహానగరంలో నాలుగు వైపులా10 ఎకరాల స్థలం కేటాయించి రూ. 100 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో హోల్సేల్ చేపల మార్కెట్లను నిర్మించాలని మాట్లాడినారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మత్స్య సోసైటికి 10 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించేందుకు, వచ్చే బడ్జెట్ లో మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్య కారుల సంక్షేమం కోసం రూ.5000ల కోట్లు కేటాయించాలని, 50 సం,రాల నిండిన మత్స్యకారులకు రూ/- 5 వేల రూపాయలు పించను ఇవ్వాలని ఇందుకోసం ఈనెల 20వ తేదీ జరుగే ,ఈ సదస్సులో తీర్మానం చేయనున్నామని తెలిపారు. మత్స్య సొసైటీ అధ్యక్షులు/డైరెక్టర్ల రాష్ట్ర సదస్సుకు పెద్ద సంఖ్యలో అన్ని మత్స్య సొసైటీలు భాగస్వాములై జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ గుమ్మడిరాజు.నరేష్ పాల్గొని మాట్లాడారు,
ఈ రోజు సమావేశంలో 13 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షులుగా కొప్పు పద్మ, ప్రధాన కార్యదర్శిగా ముఠా విజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా ముటా దశరథ్,గాండ్ల అమరావతి, సహాయ కార్యదర్శులుగా చంద్రీ.పుష్ప, పూస నాగమణి, పంపరి మంజుల, కే విజయలక్ష్మి, కమిటీ సభ్యులుగా పూస.ప్రదీప్ గౌటి మధుసూధన్, కల్లూరి విమల,కల్చేటి.యాదగిరి,పి లక్ష్మమ్మ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.