
పినపాక ప్రభాకర్, కార్మిక నేత తెలంగాణా ఉద్యమకారుడు, నాటి TJAC కో ఆర్డినేటర్.*తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణం, చార్మినార్ లను తీసివేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదు అని పినపాక ప్రభాకర్ అన్నారు. గొప్ప చరిత్ర ఉన్న చిహ్నం కళాతోరణం అని, ఒకప్పుడు వరంగల్ ప్రాంతాన్ని పాలించిన కాకతీయులు ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటును అందించించారనీ, ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన సాగించిన కాకతీయలకు గుర్తింపుగా కళాతోరణం నిలిచింది అని, కాకతీయుల పాలనావైభవాన్ని చాటిచెప్పే చిహ్నం. అంతేకాక సుమారు 200 ఏండ్లు పాలించిన కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు, చారిత్రక కట్టడాలు, దేవాలయాల ఘన చరిత్ర, పాలన వైభవం అంతా కళాతోరణంలో పూసగుచ్చినట్టుగా ఉన్నది. ఓరుగల్లు చారిత్రక ప్రాధాన్యానికి కళాతోరణం చిహ్నంగా నిలిచింది అని అన్నారు. కళాతోరణం తొలగింపుతో ఓరుగల్లుకు ఉన్న గొప్ప చారిత్రిక గుర్తింపు మాయం కావడంతోపాటు ప్రాధాన్యం తగ్గుతుందనీ, అలానే హైదరాబాద్ అంటే నే చార్మినార్ అని గుర్తుకొస్తుంది అని, గతంలో చార్మినార్ కు 400 ఏండ్లు నిండిన సందర్భంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సవాలు చేసింది.. మారి ఈ నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోగో నుండి తీసివేయటం సరైనది కాదు.ఎంతో ఘన చరిత్ర ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ లను రాజముద్ర నుంచి తొలగించే ప్రభుత్వ నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వం అమరవీరుల స్థూపం , బతకమ్మ పేటాలనుకుంటే ఉన్న వాటిని తీయకుండా పెట్టవచ్చు ఎవరికి అభ్యంతరం ఉండదు. ప్రభుత్వ నిర్ణయాలు ఎప్పడూ ప్రజల ఆమోదోగ్యంగానే ఉండాలె తప్ప ప్రజా వ్యతిరేకంగా ఉండకూడదు అన్నారు…