
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సభను జయప్రదం చేయండి
ఈనెల 10వ తేదీన పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మెకు కనకా రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గం లోవీరనారి రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్మారక భవనంలో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కనకా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.నాడు దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన వీర తెలంగాణ విప్లవ రైతంగ సాయుధ పోరాట కేంద్రంగా పాలకుర్తి నిలిచిందని విస్నూర్ రాపాక రామచంద్రారెడ్డి ఆగడాలను ఎదిరించి ఇక్కడ ప్రజలు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఎర్రజెండాలు చేతబూని పోరాటాలు కొనసాగించారని ఆ పోరాటంలో చిట్యాల ఐలమ్మ ముందు వరుసలో ఉండి ప్రజలకు ధైర్యం చెప్పి దొర ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని తన భూమిలో పండిన పంటను భూస్వాములు లాక్కొని వెళ్తుంటే ఎర్రజెండా చేత భూమి వారిని తరిమి కొట్టిన చరిత్ర చిట్యాల ఐలమ్మది అని కొనియాడారు. నేటి యువత చిట్యాల ఐలమ్మ చరిత్రను తెలుసుకొని వారి ఆశయాల కోసం ముందుకు సాగాలని కోరారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 10వ తేదీన పాలకుర్తి మండల కేంద్రంలోని చౌరస్తాలో ఐలమ్మ వర్ధంతి జరుగుతుందని వర్ధంతి సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు పాలకుర్తికి వస్తున్నారని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్, జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య,రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదునూరి మదర్, లక్ష్మణ్, నరేష్, అశోకు, తదితరులు పాల్గొన్నారు