
ఈ69న్యూస్ జఫర్గడ్ ఆగస్టు 2
తెలంగాణ రైతు సంఘం జఫర్గడ్ మండల కమిటీ ఎన్నికలు మండల కేంద్రంలోని తమ్మదిపల్లి (జి) గ్రామంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ మహాసభకు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య,కార్యదర్శి భూక్య చందు నాయక్‌లు ముఖ్య అతిథులుగా హాజరై,ఎన్నికలను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా రాయపురం భిక్షపతి మండల అధ్యక్షుడిగా,నక్క యాకయ్య మండల ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అలాగే ఉపాధ్యక్షులుగా వడ్లకొండ రాజు,వాసం కృష్ణమూర్తి,సహాయ కార్యదర్శులుగా నల్లతీగల శ్రీనివాస్, ఎంపెళ్లి అజయ్‌లు ఎన్నికయ్యారు.కమిటీ సభ్యులుగా అన్నెపు ప్రభాకర్,ఎండి.శంశోద్దీన్,షాగా యాదగిరి,ఎర్ర రవి,షాకినల కొమురెళ్లి,మాద్రాజు యాదగిరి తదితరులు ఎన్నుకోబడ్డారు.మొత్తం 13 మందితో కూడిన మండల కమిటీని ఏర్పరిచారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు,కార్యదర్శులు మాట్లాడుతూ…రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా కిసాన్ సభ పిలుపుతో రైతుల సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తాం.మాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు అని తెలిపారు.