అధికారులు స్పందించి రైస్ మిల్లు నిర్మాణం పర్మిషన్ రద్దు చేయాలి-రైతు తాటికాయల రాజేందర్
ఈ69న్యూస్ జఫర్ఘడ్ జనవరి 31
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం లోని తిమ్మాపూర్ గ్రామంలో దళితుల పంట పొలాల పక్కన రైస్ మిల్లు నిర్మాణం చేయవద్దని అన్నందుకు గ్రామ రైతు కోఆర్డినేటర్ గా కొనసాగుతున్నా పెండ్లి స్వామి,తిమ్మాపురం గ్రామశాఖ అధ్యక్షులు ఎర్ర నరేష్,హిమ్మత్ నగర్ మాజీ ఎంపీటీసీ ఎర్ర సతీష్,ప్రభాత వార్త రిపోర్టర్ బోనగిరి శ్రవణ్ కుమార్ లు కొడతామని బెదిరిస్తున్నారని సమీప పొలం రైతు తాటికాయల రాజేందర్ అన్నారు.ఈ మిల్లు నిర్మాణానికి అడ్డం వస్తే నిన్ను రోడ్ల మీద కూడా తిరగనివ్వమని బెదిరిస్తున్నారని అన్నారు.తిమ్మాపురం గ్రామానికి చెందిన ఎర్ర సతీష్ ఎర్ర నరేష్ మరియు జఫర్గడ్ గ్రామానికి చెందినా అంచూరి యుగేందర్,బోనగిరి శ్రవణ్ కుమార్ ధాంశెట్టి సోమన్నలు అతి తక్కువ స్థలంలో రైస్ మిల్లు నిర్మిస్తున్నారని,దాని వలన దుమ్ము ధూళి ఉనుకతో పక్కనే ఉన్నా మా భూమిలో పడతదని దాని వలన పంట నష్టం జరుగుతదని అన్నారు.తరతరాలుగా ఆ భూమినే నమ్ముకొని బతుకుతున్నా మా దళితుల బతుకులు ఆగమయి రోడ్డున పడే పరిస్థితి వస్తుందని అక్కడ మిల్లు నిర్మించనివ్వవద్దని, మా దళితుల కుంటుంబాలకు బతుకు దేరువు లేకుండా చెయ్యొద్దని మా దళితుల బతుకులతో ఆడుకోవొద్దని అన్నారు. జిల్లా,మండల ప్రభుత్వ అధికారులు,స్పందించి పర్మిషన్ రద్దు చేయాలని అన్నారు.