పాలకుర్తి, మార్చి (నిన్న)ఆమె ఓ సపాయి కార్మికురాలు. పాలకుర్తి గ్రామ పంచాయతీలో 25 ఏండ్లుగా పని చేస్తున్నది. ఆమెకు కొడుకు, బిడ్డ. బిడ్డ పెళ్ళి చేసింది. ఈ మధ్యే కొడుకుకు కూడా పెళ్ళి చేసి, బాధ్యతలు తీరాయని భావించింది. కానీ, ఏడాది తిరగక ముందే ఎదిగిన కొడుకు కాస్తా నేలకొరిగిపోయాడు. ఉన్న ఫళంగా వచ్చిన గుండె నొప్పి, ఆ తల్లికి కడుపుకోతని మిగిల్చింది. సుశీల కొడుకు గాదెపాక ప్రశాంత్ (26) పాలకుర్తి లో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగించే వాడు. ప్రస్తుతం BRS పార్టీ యువజన నాయకుడు. ప్రశాంత్ అకస్మాత్తుగా నిద్రలో వచ్చిన గుండెపోటు తో మరణించాడు. దాంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు (నిన్న)వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రశాంత్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటాం అని భరోసా కల్పించారు. ప్రశాంత్ ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థించారు దయన్న వెంట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్’*రైతు మండల కోఆర్డినేటర్వీ రమనేని యకాంతరావు పాలకుర్తి పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కడుదుల కరుణాకర్ రెడ్డి*పాలకుర్తి పట్టణ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిఎడవేల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నార