దీప్తికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నాగరాజు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండల పరిధిలోని కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి ఆస్ట్రేలియా లోని బ్రిస్బెన్ వర్చుస్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 మూడు రోజులుగా జరుగుతున్న పోటీలో శనివారం రోజున క్వాలిఫైయింగ్ రౌండ్ పూర్తి చేయగా ఆదివారం జరిగిన ఫైనల్లో గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా జీవాంజి దీప్తిని మరియు ఆమె కోచ్ ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు. జీవాంజి దీప్తికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ దీప్తి మరిన్ని పథకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు