
కల్లుగీత కార్మిక సంఘం జనగామ జిల్లా సీనియర్ నాయకులు దూడల పాండు ఈరోజు ఉదయం ఆకస్మాత్తుగా గుండెపోటుతో ఉదయం 7 గంటలకు మరణించారు. సందర్భంగా పాండు స్వగృహమైన పసరమడ్ల గ్రామానికి కార్మిక సంఘం నాయకులు వెళ్లి వారి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి జిల్లా కార్యదర్శి బల్నే వెంకట మల్లయ్య మాట్లాడుతూ దూడల పాండు తనకు ఊహ తెలిసినప్పటి నుండి గత 50 సంవత్సరాలుగా కల్లుగీత కార్మిక సంఘంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేశారని జిల్లా కమిటీ సభ్యునిగా సేవలందించారని అలాగే జనగామ ప్రాంతంలో గీత కార్మికుల సమస్యలపై అనునిత్యం పోరాటాలు నిర్వహించాలని ముఖ్యంగా పట్టేదారుల సమస్యలను ఆప్కారి అధికారుల ఆగడాలకు వ్యతిరేకంగా కల్లుగీత కార్మిక సొసైటీలలో గుర్తింపు కార్డులు సభ్యత్వాలు ఇవ్వాలని పోరాటాలు నిర్వహించే దాంట్లో కీలకపాత్ర పోషించాలని తెలిపారు. అలాగే పసరమడ్ల గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాలలో పాలు పంచుకున్నారని తెలిపారు. దూడల పాండు మరణం ప్రజా ఉద్యమాలకు ముఖ్యంగా కల్లుగీత ఉద్యమానికి తీరని లోటని వారు తెలిపారు.*ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు జనగామ మాజీ ఎంపీపీ బైరగోని యాదగిరి KGKS జనగామ మండల కార్యదర్శి మార్కా ఉపేందర్ బండి గారి శివరాజు గ్రామ నాయకులు జిల్లా కమిటీ సభ్యులు కుర్రెముల సిద్దయ్య కుర్రముల పరశురాములు శంకర్ రాములు బాల సిద్ధులు జనగామ జిల్లా గోపా నాయకులు దూడల రాజ సంపత్ మాజీ కౌన్సిలర్ గుజ్జుల భక్తతుకారం తదితరులు పాల్గొన్నారు.