దూదేకులపల్లిలో టీఆర్పీ పార్టీలో బారీ చేరికలు
పార్టీ జెండా గద్దె ప్రారంభించి జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి రూరల్ మండలం దూదేకులపల్లి గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో పార్టీ జెండా గద్దె ప్రారంభోత్సవం, జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా గద్దెను ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా నాయకులతో కలిసి పార్టీ జెండాను ఎగరవేశారు.ఈ సందర్భంగా పలువురు వివిధ పార్టీల నేతలు టీఆర్పీ పార్టీలో చేరి పార్టీకి మద్దతు ప్రకటించారు.వారికి రవి పటేల్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లాలోని ప్రతి గ్రామంలో టీఆర్పీ జెండా గద్దెలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రతి గడపకు టీఆర్పీ అజెండా చేరేలా కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పేర్కొంటూ,బహుజనుల రాజ్యాధికారమే పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ గుర్తు కత్తెరను ప్రతి ఇంటికి చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.2028లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్నను ముఖ్యమంత్రిగా చేయడమే మన తుదిలక్ష్యమని అన్నారు. అందుకు తొలి అడుగుగా భూపాలపల్లి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, సామల శ్రీలత, మడే సంతోష్, శ్రీకాంత్, ప్రణీత్, మామిడి శ్రీకాంత్తో పాటు దూదేకులపల్లి గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.