
ఎండి మహబూబ్ పాషా నేతృత్వంలో బహిరంగ ర్యాలీ
ఈ69న్యూస్ వరంగల్,జూలై 9:వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా వరకు జరిగిన సార్వత్రిక సమ్మె మహా ర్యాలీలో సిఐటియు అనుబంధ తెలంగాణ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్ యూనియన్ చేపట్టిన ఆటోలో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.జిల్లా అధ్యక్షులు ఎండి మహబూబ్ పాషా నేతృత్వంలో,సిఐటియు జెండాలతో అలంకరించబడిన అనేక ఆటోలు వరుసగా ర్యాలీగా సాగాయి.ఈ ప్రదర్శన వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి పోస్ట్ ఆఫీస్,చౌరస్తా మీదుగా పోచమ్మ మైదాన్ వరకు సాగింది.ఆటో డ్రైవర్ల సమస్యలు,డిమాండ్లను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ర్యాలీ ఏర్పాటు చేసినట్టు మహబూబ్ పాషా తెలిపారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాల రద్దు చేయాలని,ఆటో ట్రాన్స్పోర్ట్ రంగంలో అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలు,అధిక జరిమానాలు,పోలీస్ కేసుల నుండి ఆటో డ్రైవర్లను రక్షించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.అలాగే,రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు సేవలను నగర పరిధిలో వర్తింపజేయవద్దని,అది ఆటో రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు.ఈ ర్యాలీలో ఎం.ఎ.సలాం,జాఫర్,దేవేందర్,నజీర్,ఐలయ్య,సంపత్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.