
ధర్మసాగర్ మండలం కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
ధర్మసాగర్ మండలం కేంద్రం లో మండల అధ్యక్షులు గంకిడి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సామాజిక అణిచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి స్ఫూర్తి ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 132 జయంతికి హాజరై స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే శ్రీ బొజ్జపల్లి రాజయ్య గారి తనయుడు బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ బొజ్జపల్లి సుభాష్ గారు హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, న్యాయ శాస్త్ర కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల మన దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో దళిత మోర్చా పెద్దపెల్లి జిల్లా ఇన్చార్జి చిలక విజయరావు, OBC మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల సంపత్, OBC మోర్చా మండల అధ్యక్షులు పూల శ్రీనివాస్, సోషల్ మీడియా మండల కన్వీనర్ దాసరి సదానందం, యువ మోర్చా మండల అధ్యక్షులు కలిపాక లవణ్, యువ మోర్చా మండల ఉపాధ్యక్షులు చింత రఘుదీర్ గౌడ్, పకిడే నవీన్, S యువరాజు, మండల రమేష్, అడెల్లి ప్రశాంత్, మోరే రాజేందర్, లింగంపల్లి చిరంజీవి, వెంకటేష్, ఎగ్గోజు పూర్ణ చారి, తదితరులు ఉన్నారు