
telugu galam news e69news local news daily news today news
ధర్మసాగర్ మండల కేంద్రంలోని యం.పి.డి.ఓ కార్యాలయం నందు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం జరిగింది.ఈ సమావేశం పలు శాఖలకు సంభందించిన అధికారులు హాజరైనారు, శాఖల వారీగా సమీక్ష నిర్వహించిన యం.ఎల్.ఎ కడియం శ్రీహరి వివిధ శాఖల అభివృద్ధి పనుల స్థితి గతులు వాటి అవసరాలు తెలుసుకొని ఆ సంబంధిత అధికారులను త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అలాగే అవసరాన్ని బట్టి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.ఏ అధికారి కూడా విధుల పట్ల అలసత్వం వహించవద్దని మండలాన్ని అభివృద్ధి పథంలో నిలపాలని కోరారు. పలువురు ప్రజా ప్రతినిధులు తమ గ్రామాలలోని సమస్యలు యం.ఎల్.ఎ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించే దిశగా అయా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు.తదుపరి మండలం లోని గ్రామ సర్పంచులు తమ పదవికాలం నాటి అనుభవాలను సభాపూర్వకంగా వెల్లుబుచ్చారు.ఈ సమావేశం లో కడియం శ్రీహరి మాట్లాడుతూ… తాను యం.ఎల్.ఎ అయిన తర్వాత తాను హాజరవుతున్న మొదటి మండల సర్వ సభ్య సమవేశమని తనకు ధర్మసాగర్ మండలం అంటే ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు.అధికారుల దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా కాలయాపన చేయకుండా పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని కోరారు. రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు జమకానందున ఫిబ్రవరి 29వ తారీకులోగా రైతు ఖాతాలో రైతుబంధు డబ్బులు జమ చేయాలని తీర్మానం చేశారు.రైతు ఋణ మాఫీ పైన కూడా మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఋణ మాఫీ పైన కూడా ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాలని కోరారు. అనంతరం ఈ మాసంతో పదవీకాలం పూర్తి కాబోతున్న సర్పంచులను సన్మానించారు.