
ఈ69న్యూస్ హన్మకొండ: ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ సమీపంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఎంపీఆర్ఎస్ మరియు వివిధ రాజకీయ పార్టీల నేతలు ఘనంగా నిర్వహించారు.జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఎస్పీ జిల్లా ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ..బాబు జగ్జీవన్ రామ్ గారు విద్యార్థి దశ నుంచే కులవివక్షను ఎదుర్కొంటూ దేశ రాజకీయాలలో అగ్రస్థానానికి చేరారు.కేంద్ర మంత్రిగా అనేక సేవలందించి,ఉపప్రధాని హోదాలో ఉన్నా,ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారన్న కారణంగా ప్రధానమంత్రి అవ్వలేకపోయారన్నది బాధాకరం అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీఆర్ఎస్ నాయకులు బొడ్డుప్రణయ్ కుమార్,బొడ్డు కుమార్ (కాంగ్రెస్),నిమ్మ సుదర్శన్ రెడ్డి (బిజెపి),కూనూర్ రాజు,మాచర్ల రవి,కొలిపాక రమేష్,పుట్ట ప్రణయ్, నక్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.