నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు
తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా షాద్నగర్ ఎంపీ శేషయ్య నగర్ కమ్యూనిటీ హాల్లో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనస్మరణ చేశారు.కమ్మ సేవా సమితి ముఖ్య సలహాదారు గుదే వసంత రావు మాట్లాడుతూ..నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆరాజ్య దైవమని, ఆయన రాజకీయ రంగంలో సృష్టించిన ప్రభంజనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. బీసీలకు రాజకీయ చైతన్యంతో పాటు రిజర్వేషన్లకు నాంది పలికిన వ్యక్తి దేశంలో ఆయనేనని కొనియాడారు.నటనలో నవరసాలు, నాయకత్వంలో అపూర్వ ధైర్యాన్ని ప్రదర్శించిన మహానటుడు, కాలాన్ని దాటి నిలిచిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.ఆయన ఆదర్శాలు, సేవాభావం తరతరాలకు ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమ్మ సేవా సమితి నాయకులు కొర్రపాటి శ్రీనివాస రావు, బండారుపల్లి నాగేశ్వర రావు, వట్టికొండ ఏరయ్య, కట్టా హరి, పేరం అనిల్, మలినేని సాంబశివరావు, పాతూరి బ్రహ్మయ్య, పాతూరి సత్యనారాయణ, పాతూరి రఘు, మలినేని శ్రీను, గుదే మానిష్, గుదే మస్తాన్ రావు, నువ్వుల నాగేశ్వర రావు, కొత్త ప్రభాకర్, యర్రగుంట్ల శ్రీనివాస రావు, వెంకటేశ్వర రావు, మల్లేశ్వర రావు, శాంతి, పూర్ణ, రమేష్, శ్రీను, రమణ తదితరులు పాల్గొన్నారు.