

కలెక్టర్,సీపీకి హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాయిని
ఈ69న్యూస్ హన్మకొండ
హోలీ పండుగ వేళ నగరంలో సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.వరంగల్ పశ్చిమ నియోజవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి వేడుక జరుపుకున్నారు.అనంతరం హనుమకొండ జిల్లా,వరంగల్ జిల్లా కలెక్టర్ లు పి.ప్రావీణ్య,డాక్టర్ సత్య శారద,వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.స్థానికంగా అధికారులతో కలసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఇంటికి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.డి కన్వెన్షన్ హాల్ నిర్వహించి హోలీ సంబరాల్లో పాల్గొని యువతను అలరించారు.ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వారివెంట సీనియర్ నాయకులు వరద రాజేశ్వర్ రావు,ఈ.వి శ్రీనివాస్ రావు మరియు నాయకులు,అధికారులు,కార్యకర్తలు,అభిమానులు ఉన్నారు.