
— కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యాదగిరిగుట్టులో జరిగిన బారీ ర్యాలీ, సభలో సిఐటి యు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్
కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుధవారం రోజున జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాపిత సమ్మెలో భాగంగా యాదగిరి గుట్ట పట్టణ కేంద్రంలో సీఐటీయూ,ఏఐటీయూసీ, బి ఆర్ యస్ కె వి, ఐ ఎన్ టి యు సి,హెచ్ యం ఎస్,టి యన్ టి యు సి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో గుడి పాదాల నుండి ఎం ఆర్ ఓ కార్యాలయం వరకు కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం సభ నిర్వహించడం జరిగింది.నరేంద్ర మోడీ విధానాలు నశించాలని , లేబర్ కోడ్ లు రద్దు చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది.అనంతరం గుడి మెట్ల వద్ద జరిగిన సభలో పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం
మరియు ఏఐటీయూసీ జిలా అధ్యక్షులు గోరేటి రాములు ,హెచ్ యం ఎస్ రాష్ట్ర నాయులు శ్రీనివాస్ ,టి యన్ టి యు సి రాష్ట్ర నాయకులు రేగు బాలనర్సింహ ,బి ఆర్ యస్ కె వి జిల్లా నాయకులు బరిగే నర్సింహులు , ఐ ఎన్ టి యు సి జిల్లా నాయకులు రాజిరెడ్డి ,పివై యల్ నాయకులు బేజాడి కుమార్ లు పాల్గొని మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్మికుల 8 గంటల పని కాస్తా 12 గంటలగా మారుతుందని , ఏ యూనియన్ ఏర్పాటు చేయాలన్న 100 (వంద ) మంది కార్మికులు లేదా 10 శాతం కావాలని లేబర్ కోడ్ లు చెప్తున్నాయని ఇక యూనియన్ ఏర్పాటు ప్రశ్నార్ధకమే
అని అందుకే లేబర్ కోడ్ లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ ఎన్నికలలో 51 శాతం పైగా ఓట్లు వస్తేనే గుర్తింపు యూనియన్ గా లెక్కిస్తామని చెప్పడం ,ట్రేడ్ యూనియన్ నాయకులు 05 మందికి మించి ఉండకూడదని నిబంధన పెట్టి పరిశ్రమలో పనిచేసేవారిపై వత్తిడి చేసి విధంగా చేయడం కార్మికులకు ఉన్న ప్రజాస్వామిక హక్కును హరించడమే అన్నారు.
వేతనాల కోడ్ లో ఉన్న వేతనం పేరు ఉన్మ కోడ్ లో ఎక్కడ వేతనాలను ఎలా నిర్ణయిస్తారు అనే ప్రస్తావన లేకపోవడం లేబర్ కోడ్ ల ప్రత్యేకత అని విమర్శించారు.దేశం మొత్తం కరోనా లో ఉంటే మోడీ ప్రభుత్వం మాత్రం కార్పో రేట్ ల సేవలో లేబర్ కోడ్ లను కనీసం పార్లమెంట్ లో చర్చకు అవకాశం ఇవ్వకుండా మూడు లేబర్ కోడ్ లను తెచ్చిందని విమర్శించారు.లేబర్ కోడ్ ల రద్దు కోసం రానున్న కాలంలో మరిన్ని పోరాటాలు చేయడం కోసం సిద్ధం కావాలని కార్మికులకు పిలునిచ్చారు.
ఈ ర్యాలీ , సభ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి సుబ్బూరు సత్యనారాయణ , జిల్లా కమిటి సభ్యులు పుప్పల గణేష్ , అంగన్వాడీ నాయకురాలు ఉమా ,సునీత ,ప్రజాసంఘాల నాయకులు షరీఫ్, యాదప్ప ఏఐటీయూసీ నాయకులు పేరబోయిన మహేందర్, పేరబోయిన స్వామి ,పేరబోయిన బంగారి,రాములు,యాదగిరి,
Trskv జనరల్ సెక్రెటరీ బరిగే నరసింహులు, citu జనరల్ సెక్రెటరీ చెక్క క్క రమేష్, hms జనరల్ సెక్రెటరీ సంద సంపత్, intuc జనరల్ సెక్రెటరీ రాజిరెడ్డి,పెంటయ్య , tntuc నాయకులు శ్రీశైలం యాదవ్ , నరసింహ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.