
station ghanpur news
ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవాలి- నష్కల్ గ్రామ రైతులు
అక్రమంగా తరలిస్తున్న మట్టి దందా నిలిపివేయాలి
తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని విన్నపం
తెలుగు గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్ 21
జనగామ జిల్లా చిల్పూర్ మండలం లోని నష్కల్ గ్రామంలో సర్వేనెంబర్ 143 లో 62 ఎకరాలు గత ప్రభుత్వాలు బహుజన సామాజిక వర్గానికి పంపిణీ చేయడం జరిగింది.అట్టి భూమిలో అక్రమంగా మట్టి దందా జరుగుతున్నదని పలువు రైతులు ఆరోపించారు.హద్దులు దాటి మట్టి తీయడం వలన పక్క రైతులు చాలా ఇబ్బంది పాలవుతున్నారని వారి ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే దీనికి సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధులు రైతుల సమస్యలను పట్టించుకోని రైతులకు అండగా నిలవాలని కోరారు.నష్కల్ గ్రామం నుండి రైతుల పొలాలు మరియు ఉప్పుగల్లుకు చేరుకునే దారి మధ్యలో చెరువు క్రింద మత్తడి వద్ద రైతుల రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్నారు.గత రెండు నెలల కింద కురిసిన వర్షం వలన రైతులు భారీగా నష్టపోయారని వారి పొలాల దగ్గరికి రాకపోకలు విషయమై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే ప్రభుత్వాలు పట్టించుకోని రైతుల సౌకర్యార్ధం ఒక వంతెన నిర్మించాలని కోరారు.ఇప్పటికే అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నామని ఇకమీదట ఎలాంటి నష్టాలు జరగకుండా ఉండాలని ప్రభుత్వాలను కోరారు. తక్షణమే దీనికి సంబంధించి అధికారులు,ప్రజాప్రతినిధులు రైతుల సమస్యలపై స్పందించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్టేషన్గన్పూర్ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఇన్చార్జి గంటే ఉపేందర్ యాదవ్,చిల్పుర్ మండల సోషల్ మీడియా ఇన్ఛార్జి రఘుపతి,పాశం శ్రీధర్, ఆరూరి దాస్,యావగొని శ్రీనివాస్ ,కందరపు రాకేష్,పెంజర సాయి,చేగొండ శ్రీనివాస్,కంకటి రాజు,చేగొండి రాజకుమార్,వడ్లకొండ నరసయ్య,గాదే పద్మ,చేగొండ కోమల,నక్క పూలమ్మ తదితరులు పాల్గొన్నారు.