నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం
వర్ధన్నపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు లబ్ధి
•ప్రజల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యత
•వర్ధన్నపేట టౌన్ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే నాగరాజు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ…వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టౌన్ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం అవసరమైన స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించి సేకరించడం జరిగింది. ఈ ఆస్పత్రి ఏర్పాటుతో వర్ధన్నపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సులభంగా,నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తప్పుతాయి.ప్రజల ఆరోగ్యం మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ,వర్ధన్నపేట అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం.ఈ 100 పడకల ఆస్పత్రి త్వరలోనే మంజూరు అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాం.ఈ కార్యక్రమానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,స్థానిక ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను”అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు