
ఈ69న్యూస్:- నల్గొండ జిల్లా,నిడమానూరు మండలం,బొక్కమంతలపహాడు గ్రామంలో దళిత బాలిక దర్మారపు మల్లేశ్వరి అగ్రకులవాళ్ల చేతిలో జరిగిన కుట్రకు బలైపోయిందని ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ తెలిపారు.బాధిత కుటుంబానికి న్యాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ..”మల్లేశ్వరి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం.ఈ సంఘటనకు న్యాయపూర్వక పరిష్కారం తప్పనిసరిగా జరగాలి,”అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు దుబాస్ కొండల్,CH.ప్రసాద్,పగిదిమర్రి శంకర్ బాబు,కొయ్యల నరేష్,రాపోలు జశ్వంత్,పెదమాం అబ్రహాం,P.వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని మల్లేశ్వరి కుటుంబానికి మద్దతు తెలిపారు.