
జయశంకర్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్ భూపాలపల్లి పరకాల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించిన భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఐత ప్రకాశ్ రెడ్డి మరియు టిపిసిసి సభ్యులు ,భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ… మైలారం గుట్టకు కన్నేసిన స్థానిక ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి తన సొంత లాభాల కోసం కంపెనీలను కట్టడం కోసం నిరుపేదలకు ఇంటి స్థలం లేని వారికి ఇవ్వకుండా నియో వర్గానికి చెందిన పలుచోట్ల అక్రమంగా వందల ఎకరాల భూములను ఆక్రమిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కంపెనీ కొరకు కేటాయించకుండా నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిపిచ్చి పేదలకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు పది సంవత్సరాల నుండి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రశ్నించే వ్యక్తులపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారని వారు అన్నారు.గణపురం మండల పరిధిలోని చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఇల్లు లేని ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు నివాసం మరియు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి,ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా డబుల్ బెడ్ రూములు కట్టిస్తామని కట్టేయలేదు గణపురం మండలంలోని సుమారు 2500 మంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరికీ మైలారం గుట్టలోని భూములను ఇండ్ల స్థలాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు బొంద పెట్టడం ఖాయమని వారు అన్నారు మీరు వెంట టిపిసిసి సభ్యులు చల్లూరి మధు మండల ఎంపీపీ కావటి రజిత రవీందర్ వైసిపి విడిది నేని అశోక్ గాంధీనగర్ గ్రామ సర్పంచ్ మాదం మమత సుధాకర్ తదితర మండల నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు గాంధీనగర్ గ్రామ మైలారం గ్రామ నాయకులు పాల్గొన్నారు.