
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డిది నీచ రాజకీయమని ప్రజల్లో తన ఉనికిని కాపాడు కోవడానికే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయలు నరసయ్య విమర్శించారు.శనివారం ఆయన మండల నాయకులతో కలిసి కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.కొన్ని రోజుల క్రితం భూపాలపల్లి మంజూరునగర్ లో బర్ల షెడ్డు ను చట్టపరంగా అధికారులు కూల్చి వేస్తే దాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కావాలనే కూల్చి వేశాడంటు బర్ల షెడ్డు యజమానికి మాయ మాటలు చెప్పి గేదే లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తోలి సత్తన్న పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం నీచ రాజకీయమ న్నారు.ఎమ్మెల్యే సత్యనారాయణ రావు రాజ్యాంగాన్ని గౌరవించి చట్టపరంగా మాత్రమే పనులు చేస్తాడని నీలాగా చేయడని చట్టాన్ని చుట్టంలా వాడి పేదల భూములు కబ్జాల అని దుయ్యబట్టారు.భూపాలపల్లి సిఐ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేని యెడల చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని నరసయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, పిఎసిఎస్ చైర్మన్ నడిపల్లి విజ్జన్ రావు పాల్గొన్నారు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మేకల బిక్షపతి,ఉమేష్ గౌడ్,మండల కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.