
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ , కాపుగల్లు తొగర్రాయి గ్రామాలలో గీత కార్మికులతో కలిసి సందర్శించి తాటి చెట్ల నుండి వచ్చే నీరా పానీయంను సేవించిన కౌండిన్య గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు(ప్రముఖ న్యాయవాది) కే.ఎల్.ఎన్ ప్రసాద్ ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయల వ్యయంతో నీరా పానీయంను ప్రజలకు అందించేందుకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున సిద్ధం చేస్తుందన్నారు.అలాగే ట్యాంక్ బండ్ పై నీరా స్టాల్స్ ను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని గౌడ్ అన్నలకు హక్కులు కల్పించిందన్నారు.నీరా పానీయం ప్రజలలోకి తీసుక వెళ్లే క్రమంలో గ్రామాలలో గీత కార్మికులు నీరా పానీయంను ఉత్పత్తి చేసుకుని ఆర్థిక స్వలాభాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, ఎక్సైజ్ శాఖ మాత్యులు శ్రీనివాస్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు, పూర్వకాలంలో దేవతలు కూడా నిరా పానీయంను సుర పానకంగా సేవించారన్నారు.నీరా పానీయంను పిల్లల నుండి పెద్దల,మహిళలు,గర్భిణీ స్త్రీలు,వృద్ధులు వరకు ప్రతి ఒక్కరూ సేవించి పూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.నీరా పానీయంలో ఎన్నో ఆయుర్వేద సుగుణాలు కలిగి ఉండడం వలన శరీరంలో దీర్ఘకాలిక రోగాలను మటు మాయం చేస్తుందని,కిడ్నీలలో ఎంతటి రాళ్లనైనా తొలగిస్తుందని పరిశోధకులు శాస్త్రవేత్తలు గతంలో చాలాసార్లు తెలిపారన్నారు.కల్లుకి నీరా పానీయంకి చాలా వ్యత్యాసం ఉందని కల్లులో ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుందని నీరా పానియంలో అలాంటిది ఉండదన్నారు.