కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల పనులు పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి | Parkal News | E69NEWS
తెలుగు గళం న్యూస్, పరకాల, సెప్టెంబర్ 16
పరకాల పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి పనుల పురోగతి పై సమీక్షించారు.నాణ్యత ప్రమాణాలు పాటించి, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని,ఈ కళాశాల పూర్తి అయితే పరకాల మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులకు అత్యుత్తమ విద్యా సదుపాయాలు లభిస్తాయని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.