
telugu galam news e69news local news daily news today news
గళం న్యూస్ మునగాల 24/01/2024
మునగాల మండల కేంద్రము లోని 3 వార్డు వీరప్పయ్య పల్లెలో 15వ ఆర్థిక సంవత్సరం నిధులతో నూతన బోరు ను మునగాల గ్రామ సర్పంచ్ చింతకాయల ఉపేందర్ వేయించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే వేసవికాలం దృష్టిలో పెట్టుకొని నూతన బోరు నిర్మాణం చేశామని తెలిపారు. ఈ బోరు వలన గ్రామంలో నీటి సమస్య 90 శాతం వరకు పరిష్కారం అవుతుందని ఆయన తెలిపారు. గ్రామ ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, నీళ్లు వృధాగా పోకుండా ట్యాపులు పెట్టుకొని గ్రామపంచాయతీ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లంజపల్లి వెంకయ్య, వార్డు మెంబర్లు కొండ రామంజి దేవినేని ఉషా.
లంజపల్లి స్పందన రాజేష్, , కాంగ్రెస్ నాయకులు కుక్కలకు లక్ష్మయ్య. గ్రామపంచాయతీ సిబ్బంది
గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.