
ఆర్థిక సహాయం అందించిన కార్మికులు
ఆర్థిక సహాయం అందించిన కార్మికులు
ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
గత వారం రోజుల క్రితం విధులు నిర్వహిస్తూ ప్రమాదవష్యత్తు కరెంట్ స్థంభం పై నుండీ పడి మృతి చెందిన ఈ దుల్ల సవర్ గాం గ్రామానికి చెందిన గజకంటి ప్రభాకర్ అనే దళిత కార్మికుని కుటుంబానికి కార్మికుల నుండీ సేకరించిన రూ “12000 లను సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ,సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న ,ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి ,లింగాల చిన్నన్న ,జిల్లా కమిటీ సభ్యులు ఆర్ .సురేందర్ లు గ్రామపంచాయితీ కార్మికులతో కలిసి కుటుంబానికి అందించారు .ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ విధినిర్వహణలో మృతిచెందిన పేద దళిత కార్మికున్ని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులు ఆదుకోక పొగ ఆదుకోవాలని అడిగినందుకు సీఐటీయూ ,సిపిఎం నాయకులపైహత్యాయత్నం కేసులు బనాయించారని మండిపడ్డారు . కాంగ్రెస్ పార్టీని గెలిపించిన వారిలో కార్మికులు ముందుభాగాన ఉన్నారు ,అందులో గ్రామపంచాయితీ కార్మికులు ముఖ్యభూమిక పోషించారని గుర్తు చేశారు .కార్మికులకు న్యాయం చేయాల్సింది పోయి అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు . దళితుల పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తున్నది వారి ప్రాణాలకు విలువలేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నదన్నారు . గెలిపించిన వారికీ ఓడించడం పెద్ద పనేం కాదని అన్నారు .ఆ దుస్థితి పట్టకుండా చూసుకోవాలని , పోలిసుల ద్వారా ఉద్యమాలను అణచాలని చూడవద్దని హితవు పలికారు . వెంటనే ప్రభాకర్ కుటుంబానికి యాబై లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి ,కుటుంబంలో ఒకరి వుద్యోగం కల్పించి ,మూడు ఎకరాల సాగుభూమిని ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో గ్రామపంచాయితీ యూనియన్ నాయకులు అశోక్ ,గంగన్న ,సోనేరావు ,వెంకట్రావు ,ఇంద్రజ్ ,కిరణ్,శంకర్,
సంతోష్,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు .