
పండుగ సంస్కృతులను కాపాడుకోవాలి
జనగామ జిల్లా జఫర్గడ్ మండల ఆర్యవైశ్య సంఘం,మహిళా సంఘం ఆధ్వర్యంలో గురువారం రాత్రి పెద్ద ఎత్తున బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్యవైశ్య యువజన మహాసభ జిల్లా అధ్యక్షులు గంగిశెట్టి ప్రమోద్ కుమార్,మహిళా సంఘం అధ్యక్షురాలు మాధంశెట్టి వరూధుని మాట్లాడుతూ..పండుగల వెనుక ఉన్న ఆత్మార్థం,వాటి విశిష్టతలను నేటి తరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు.ప్రకృతిని పూజించడం భారతీయుల సంస్కృతి కాగా,పూలతో బతుకమ్మను ఆడించడం తెలంగాణ ప్రత్యేకత అని వారు వివరించారు.జఫర్గడ్ ఆర్యవైశ్య సంఘం పెద్ద ఎత్తున బతుకమ్మను నిర్వహించడంపై నిర్వాహకులను అభినందించిన వారు,పండుగ సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవడం అత్యంత అవసరమని సూచించారు.ఈ కార్యక్రమంలో గన్ను నర్సింహులు,అనూజ,అంచూరి యుగందర్,దాంశెట్టి సోమన్న,ఇమ్మడి అశోక్,గందె సోమన్న,బోనగిరి శ్రవణ్ కుమార్,అంచూరి కమల,దాంశెట్టి శ్రావ్య,దొడ్డ ఉమ తదితరులు పాల్గొన్నారు.
“విజేతలకు వెండి బతుకమ్మల ప్రధానం”
బతుకమ్మల పోటీల్లో ఆకర్షణీయంగా అలంకరించిన బతుకమ్మలకు నిర్వాహకులు వెండి బతుకమ్మలను,పట్టుచీరలను బహుమతులుగా అందజేశారు.ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులను శిరీష,స్వాతి,రమ్యలు గెలుచుకోగా,కన్సోలేషన్ బహుమతుల కింద మరో పది మంది మహిళలు పట్టుచీరలను గెలుచుకున్నారు.