
ఈ69న్యూస్ హన్మకొండ:ఐనవోలు మండలం పంతిని గ్రామంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించాలని గ్రామ ప్రజలు జాతీయ రహదారిపై కూర్చొని నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ నేపథ్యంలో స్థానికులు జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.ఈ సందర్భంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ధర్నా విరమింపజేయే ప్రయత్నం చేశారు.అధికారులు స్పందించకపోతే ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.