
e69 news telugu news local news
భారీగా టేకు కలప పట్టివేత.
మలుగు జిల్లా నూగూరు వెంకటాపురం ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని నూగూరు వెంకటాపురం రేంజి,సరిహద్దులోని చత్తీస్గడ్ నుండి ఎదిర సెక్షన్ గుండా గోదావరి నది పడవలమీదుగా కలప దాటించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అక్రమంగాటేకు తరలిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం అందటంతో వెంకటాపురం అటవీశాఖ అధికారులుసిబ్బంది గురువారం రాత్రి ఆకస్మికంగా దాడులునిర్వహించారు. మండల పరిధిలోని ఎదిర గోదావరిపరివాహక ప్రాంతాల్లో ఇసుక ర్యాంపు సమీపంలో 13 టేకుదుంగలనుల ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఫారెస్ట్ అధికారుల దాడులను ముందే పసికట్టిన అంతర్రాష్ట్ర కలప స్మగ్లర్లు అక్కడి నుండి పరారయ్యారు. ఫారెస్ట్ రేంజ్ఫీసర్ చంద్రమౌళి ఈ మేరకు మీడియాకు శుక్రవారం
ప్రకటన విడుదల చేశారు. ఎఫ్.ఆర్.ఓ.చంద్రమౌళి కథనం
ప్రకారం సరిహద్దు ఛత్తీ స్గడ్ అటవీ ప్రాంతం నుండి అంతర్రాష్ట్ర కలప స్మగ్లర్లు గోదావరి పరివాహ ప్రాంతాల్లో కలప దుంగలను ఇసుకలో పాతిపెట్టి, తమకు
అనుకూలమైన సమయాల్లో గోదావరి పడవల గుండా
ఆవతలి ఒడ్డు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, పినపాక,
అశ్వాపురం ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం ఉందని, విశ్వసనీయమనా సమాచారంతో, వెంకటాపురం ఫారెస్ట్ రేంజీ ఆఫీసర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో గురువారం రాత్రి పెద్ద
ఎత్తున ఫారెస్ట్ సిబ్బంది దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో 13 టేకు దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ లక్ష 60 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అయితే కలప తరలించిన ట్రాక్టర్ లేక వ్యాను లభ్యం కాలేదు కానీ అనుమానాస్పదంగా ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న టేకు దుంగలనులను వెంకటాపురం
ఫారెస్టు రేంజ్ కార్యాలయానికి శుక్రవారం ఉదయం తరలించారు. ఇక్కడ నుండి ఏటూరునాగారం ఫారెస్ట్ సబ్ డివిజన్ కార్యాలయానికి తరలించనున్నట్లు తెలిసింది. ఈ
దాడుల్లో ఎస్ఆర్ఆ చంద్రమౌళి, ఎదిర సెక్షన్ ఆఫీసర్ రాజేష్,
ఎదిర ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంతోష్, వెంకటాపురం
ఫారెస్ట్ డివిజన్ అదికారులు, సిబ్బంది, బేస్ క్యాప్ సిబ్బంది
పెద్ద ఎత్తున దాడుల్లో పాల్గొన్నారు.