
telugu galam news e69news local news daily news today news
నత్తనడక తో సాగుతున్న కెనాల్ వర్క్స్
అధికారుల అవగాహన లోపంతో ఆగిన కాల్వల మరమ్మత్తులు
గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ క్రింద ఉన్న రైట్ మెయిన్ కెనాల్ పనులను మండలంలోని తానేదారిపల్లి,బోయినిగూడెం,కాలువను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. కోమటిగూడెం, కంచనపల్లి, శ్రీమన్నారాయణపురం,నవాబుపేట గ్రామాలను సందర్శించి దిగువ భూములకు నీరు సరఫరా అయ్యే మార్గాల గురించి ఆరా తీశారు.లింగాలఘనపూర్ మండలంలోని గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు.కాల్వల మీదుగా తానే స్వయంగా పర్యటించి కాల్వల ప్రక్కన ఉన్న చెట్లను పొదలను,తొలగించాలన్నారు.పర్యవేక్షణ లేక కాల్వలో చెట్లు మూళ్ళ పొదలు పెరిగాయన్నారు.చాలా చోట్ల సిమెంట్ లైన్ కూలిందన్నారు.పనులు నత్తనడకన సాగడంపై సిబ్బందిని ఎమ్మెల్యే మందలించారు. బోయినిగూడెం తూముకు షట్టర్లు లేకపోవడం తో నీరు వృధా అవుతూ మిగతా గ్రామాలకు సాగు నీటి కి ఇబ్బంది కలగడం పై కాంట్రాక్టర్లను,అదికారులు పై ఆగ్రహం వ్యక్తం చేశారు మరియు షట్టర్ల అమర్చడం పై ,కాల్వల మరమ్మత్తులకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు స్థానిక జడ్పీటీసీ,ఎంపీపీ లు,స్థానిక ప్రజాప్రతినిధులు,బీఆర్ఎస్ నాయకులు,నీటి శాఖా అధికారులు తదితరులు పాల్గొన్నారు.