పల్లగుట్టలో రూ.1.19 కోట్లు వ్యయంతో సిసి రోడ్ల ప్రారంభం
ఈ69న్యూస్:- స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పల్లగుట్ట గ్రామంలో రూ.1.19 కోట్లతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు.గ్రామ అభివృద్ధికి నన్ను ఎల్లప్పుడూ అండగా నిలబెట్టిన పల్లగుట్ట ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన ఆయన,త్వరలో మరో కోటి రూపాయల విలువైన రోడ్ల పనులు చేపడతానన్నారు.ఇప్పటివరకు 50 ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేసినట్టు,మరిన్ని ఇళ్ల కోసం త్వరలో నిధులు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల అమలులో ముందుందని తెలిపారు