
ఈ69న్యూస్ జనగామ:బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,ఎమ్మెల్సీ గౌరవనీయులు పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ..జనగామ ఆర్టీసీ కాలనీకి చెందిన యువజన నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.పల్లా అభిమాని మహమ్మద్ యాకూబ్ పాషా నేతృత్వంలో శుక్రవారం రోజు ఉదయం జనగామ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా,అనంతరం హైదరాబాద్కు బయలుదేరి పల్లా నివాసంలో ఆయనను స్వయంగా కలిసి పరామర్శించారు.ఆరోగ్యం పట్ల ఆరా తీసి,శీఘ్రంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ,దర్గా నుండి తీసుకెళ్లిన పవిత్ర ఊదును వారికి పెట్టారు.ఈ కార్యక్రమంలో యువజన నాయకులు మహమ్మద్ ఆజాం,అక్బర్,ఇమ్రాన్,రియాజ్,సుధాకర్,రాహుల్ వెంకన్న,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.