elugu galam e69news local news maripeda news telugu fast news daily news
మరిపెడ మండలంలోని గాలవారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భర్తాపురం మురళీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే మంచి లక్ష్యాలు ఏర్పరచుకొని వాటిని సాధించేవరకు కృషి, పట్టుదలతో చదవాలని అన్నారు.స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఎల్లబొయిన.కృషిక్, ఉపాధ్యాయులుగా మాధురి, చరణ్య,మౌనిక,త్రివేణి,వర్షిత్, వర్షిత,శ్రావ్య,కావ్య,వరూధిని, సాత్విక,హారిక,ఐశ్వర్య,మధు మనోజ్ తదితరులు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గుగులోత్ వెంకన్న,ఫైజుద్దీన్,బాలు,లింగాల మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.