
lDate – 23.12.2022_*.. పుణ్యం చేసిన వారికి వాళ్ళ పిల్లలకు కూడా మంచి జరుగుతుంది*__*సేవ భావంతో మెలగడమే నిజమైన ప్రభువు సేవ*__*చర్చి ప్రారంభోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు*__*(మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిసెంబర్ 23)*_పాపాలు చేసినవాళ్లు కార్లలో తిరిగినా, బిల్డింగులు కట్టినా, భోగాల అనుభవించినా అది తాత్కాలికమని… పుణ్యం చేసిన వారికి వెంటనే లాభం జరగకపోయినా వాళ్ళ పిల్లలకు మేలు జరుగుతుందని, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ సేవ చేయడమే నిజమైన ప్రభువు సేవ అని *రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా షాపూర్ మంత్రి దయాకర్ రావు గారు* అన్నారు. మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం, చింతలపల్లి గ్రామంలో ఈనేపలి ఎలిషమ్మ – యాకోబు దంపతులు నిర్మించిన చర్చిని నేడు మంత్రి ప్రారంభించారు. *ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు…*క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చి ప్రారంభం చేసుకోవడం సంతోషం.అందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలుప్రజా సేవ, భక్తి సేవలో పది మందికి సాయం చేస్తే ఒక్కరికీ వస్తుంది.దేవుడు అన్ని రూపాల్లో ఉంటాడు. అన్ని మతాలను గౌరవించాలి. ఏ మతాన్ని విమర్శించినా, కించపరిచినా వారు పాపాత్ములు.ప్రభువు పేదల బిడ్డ..పేదలకు సాయం చేశాడు. ఆయన సేవలు గుర్తుంచుకోవాలి. ఆయన బాటలో నడవాలి.ఆపద వచ్చిన వారికి అండగా ఉండాలి.పాపం చేసిన వాడి బోగాలు తాత్కాలికం. పుణ్యం చేసిన వారికి కష్టాలు ఉన్నా, వెంటనే లాభం జరగకపోయినా వారి పిల్లలకు మంచి జరుగుతుంది.ఈ చర్చికి 5 లక్షలు ఇస్తాను…ఇంకా బాగా చేయండి.మా నాయన మంచి చేస్తే నేను ఏడుసార్లు గెలిచాను…నేను మంచి చేస్తే నా పిల్లలకు అక్కరకు వస్తుంది.*దయచేసి కవర్ చేయగలరు…*