శస్త్ర చికిత్స విజయవంతం
ఈ69 న్యూస్, పామిడి.
మండలం పరిధిలోని కొండాపురం గ్రామం కు చెందిన అరవై ఏళ్ల జమ్మక్క పుట్టుకతో హెర్నియ గడ్డ తో బాధ పడుతున్నారు. ఈ సమస్య పై పామిడి ప్రభుత్వ అస్పత్రి శస్త్రచికత్స నిపుణులు డాక్టర్ కమలాధర్ సంప్రదించగా, అయన అస్పత్రి లో ఉన్న మెరుగయిన సదుపాయాలు తో అస్పత్రి ప్రధాన పర్యవేక్షకులు ఆయునటువంటి డాక్టర్ కార్తీక రెడ్డి సహకారం మరియు సలహాతో, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్ సహాయం తో శస్త్ర చికిత్స విజవంతం చేసి ప్రాణ దానం చేశారు. అందుకు కృత్నజ్ఞత గా వారు అస్పత్రి కమిటీ సభ్యులు పూజారి లక్ష్మి దేవి, చిలకల రాజగోపాల్ ని, అస్పత్రి శస్త్రచికత్స నిపుణులు కమలాధర్ ను, అస్పత్రి సూపరడెంట్ కార్తికేయ రెడ్డి ని, పూల మాల తో సత్కరించారు. ఈ సందర్బంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ పామిడి అస్పత్రి లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని మెరుగయిన సేవలు అందించే డాక్టర్స్ ఉన్నారని పామిడి పట్టణ, గ్రామీణ ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు.