
khammam news
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
తమ్మినేని పర్యటన ద్వారా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం…..
పాలేరు నియోజకవర్గ సమస్యలను అధికారులతో మాట్లాడతాను÷ తమ్మినేని వీరభద్రం
మతోన్మాద రాజకీయాలను తిప్పి
కొట్టేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలి….
తిరుమలాయపాలెం, ఏప్రిల్ 8,2023…
పాలేరు నియోజకవర్గం కమ్యూనిస్టులదే అని, ఇది కమ్యూనిస్టుల కంచుకోటాని పాలేరు నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు పూర్వం తీసుకొస్తామని మాజీ ఎంపీ,ఎమ్మెల్యే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు…
ఈరోజు తిరుమలాయపాలెం మండల పర్యటనలో భాగంగా పిండిప్రోలు, హైదర్ సాయి పేట, దమ్మైగూడెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా దమ్మాయిగూడెం గ్రామంలో జరిగిన సభలో పలు గ్రామాల నుండి సిపిఎం పార్టీలో చేరికలు జరిగాయి. దాదాపుగా 50 కుటుంబాల నుంచి గోపాయగూడెం, దమ్మాయి గూడెం తండా, పిండిప్రోలు తిమ్మక్కపేట ఏలు వారి గూడెం గ్రామాల నుంచి సిపిఎం పార్టీలో వివిధ పార్టీల నుంచి జాయిన్ కావడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శీను అధ్యక్షతన జరిగిన సమావేశంలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో కమ్యూనిస్టుల కంచుకోటని ,కంచుకోటలో పూర్వం వైభవం తీసుకొచ్చేందుకు కార్యకర్తలు అందరూ కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సిపిఎం లో చేరిన వారికి అన్ని విధాలుగా అండదండలు ఉంటాయని, నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసేది సిపిఎం పార్టీ అని ఈ సందర్భంగా అన్నారు. భవిష్యత్తులో పాలే నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద ఉద్యమాలు చేస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో పాలేరు నియోజకవర్గం సిపిఎం పార్టీకి మొదటి ప్రాధాన్య త , ఏది ఏమైనా సిపిఎం పాలేరు నియోజకవర్గం లో పోటీ చేసి తీరుతుందని ఈ సందర్భంగా తెలియచేశారు.
మతోన్మాద రాజకీయ పార్టీలను తరిమి కొట్టే దానికోసం కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుంటామని, ఈ పోరాటంలో టిఆర్ఎస్ ముందు ఉండటం వల్ల దాంతో కలిసి పోయేందుకు సిపిఎం కి ఎలాంటి అభ్యంతరం లేదని అయన తెలియజేశారు.
ఈ పర్యటనలో భాగంగా అనారోగ్యంతో ఉన్న, మరియు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారిని,సిపిఎం పార్టీ కార్యకర్తలను, విలేకరులను, ఆయన ఈ సందర్భంగా పరామర్శించారు. హైదరసాయిపేట, పెండిపోలు గ్రామాల్లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మండల ఇంచార్జ్ షేక్ బషీరుద్దీన్, మండల నాయకులు అంగిరేకుల నరసయ్య, వేగినాటి వెంకట్రావు, దాసరి మహేందర్, తుళ్లూరు నాగేశ్వరరావు, వీరన్న, నాగాటి సురేష్, నెరసుల వెంకటేష్, చలం స్వామి, కొండేటి నిర్మల్ రావు, రవి, చల్లా వెంకటేశ్వర్లు, పప్పుల ప్రసాద్ పప్పులు ఉపేందర్, మోరా ఉపేందర్ రెడ్డి, రాజశేఖర్, రావుల వెంకటరామిరెడ్డి, ముసునూరి వీరభద్రం, దిండు మంగపతి, తదితరులు పాల్గొన్నారు…..
ఈ సందర్భంగా చేరిన వారిలో బోడపట్ల సతీష్, ఈశ్వరరావు, రాయల వెంకన్న, పొట్ట పెంజర బిక్షం, సందీప్, పొట్ట పెంజర గురవయ్య, చాగంటి వీరస్వామి, ప్రముఖ వ్యాపారవేత్త హనుమారెడ్డి, శేఖర్, ఉప్పయ్య, రమేష్, జగన్నాథం, తదితరులు నాయకత్వంలో 50 కుటుంబాల వారు చేరారు..