పిల్లలకు స్పోర్ట్స్ కిట్ అందజేత
గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాంపురం ప్రాథమిక పాఠశాలకు గ్రామ సర్పంచ్ పెండ్లి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు వాలీబాల్ కిట్, రింగ్ బాల్స్, స్కిప్పింగ్ రోప్స్, విజిల్ అందజేయడం జరిగింది.పాఠశాల ఉపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్ కోరిక మేరకు గ్రామ ఉప సర్పంచ్ బంధు యాకన్న రెండు క్యారం బోర్డులు, రెండు చెస్ బోర్డులు, రింగ్ బాల్స్, స్కిప్పింగ్ రోప్స్ పాఠశాల కు అందజేయ్యడం జరిగింది ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతిలో భాగమని, క్రీడలు ఎవరి సొత్తు కాదని తెలిపారు, క్రీడాకారులుగా రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా ఉన్నాయని తెలిపారు,క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు,ఈ సందర్భంగా విద్యార్థులకు వాలీబాల్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్‌కు సంబంధించిన స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా క్రీడల్లో రాణించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హీరా లాల్, గుర్రం వెంకన్న గౌడ్, కనకం గణేష్,విద్యార్థుల తల్లిదండ్రులు బందు పరశురాములు,చింత అశోక్,బందు యుగేందర్, విస్సoపల్లి ఉమేష్,నరేష్,బందు గణేష్ ,విద్యార్థులు పాల్గొన్నారు.