
కోలా దర్గయ్య
ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఈ నెల 25, 26వ తేదీలలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరుగుతున్నాయి. ఈ రాజకీయ శిక్షణ తరగతులకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) కార్యకర్తలు, నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. కరపత్రాలు ఆవిష్కరణ చేసి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు కోలా దర్గయ్య, షేక్ జానీ, మట్టపల్లి గోపి, కోటేష్, పాషా తదితరులు పాల్గొన్నారు.