పుర పోరులో కాంగ్రెస్ గెలుపుకు పొంగులేటి వ్యూహం
ఖమ్మంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో పొంగులేటిను రాష్ట్ర కాంగ్రెస్ నేత సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త మట్టా దయానంద్ విజయ్ కుమార్ సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు.రానున్న మున్సిపల్ ఎన్నికలలో సత్తుపల్లి,కల్లూరు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ గెలుపుకోసం తీసుకోవాల్సిన వ్యూహాలను మట్టా కు ఆయన తెలిపారు.సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం,చేయబోయే అభివృద్ధి గూర్చి తెలపాలన్నారు.కార్యకర్తలు సైనికులులాగా పని చేసేలా అవగాహన కల్పించాలని తెలిపారు