
ఈ69న్యూస్ వరంగల్
పుల్లాయి కుంట తూమును ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని లెనిన్ నగర్ కాలనీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం. సాగర్ కోరారు.సోమవారం ప్రజా వాణి లో
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పుల్లాయికుంట తూము ఆక్రమణ ను తొలగించి వరద ముంపు నుండి 250 కుటుంబాలను కాపాడాలని కోరారు.రంగాశాయిపేట లెనిన్ నగర్ 42వ డివిజన్ పరిధిలో ఉన్న పుల్లాయికుంట తూము ఆక్రమణకు గురైంది అన్నారు.ఒక ప్రైవేట్ వ్యక్తి తూమును ఆక్రమించుకున్నారన్నారు.దీని వలన లెనిన్ నగర్ ఆర్.టి.ఎ.ఆఫీస్ ప్రాంతం గత సంవత్సరం వర్షాలు కురిసిన సందర్భంగా వరద ముంపునకు గురైందన్నారు.అప్పుడు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళామన్నారు.పై నుండి వచ్చే వరద నీరు పుల్లాయికుంటలో చేరి తూము ద్వారా క్రిందికి వెళ్ళేదని,దానిని ఒక ప్రైవేట్ వ్యక్తి ఆక్రమించుకొని ఆ నీటి ప్రవాహాన్ని బయటికి వెళ్ళడానికి 5 ఫీట్ల పైపు అండర్ గ్రౌండ్లో వేసి ఆ తూమును పూడ్చివేశాడని ఆరోపించారు.దీంతో నీరంతా ఆగి 250 కుటుంబాలు వరదలో మునిగి పోతున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు.తూమును ఓపెన్ గా వుంచాలని,అలాగే ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి గుంటి కుమార్,కోశాధికారి గొడుగు సంతోష్,ఉపాధ్యక్షుడు అబ్బోజు రాజు,సభ్యులు శ్రీనివాస్,తిరుమలేశు,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.