
పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ.
- ఎస్ఎఫ్ఐ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు బానోతు. లక్ష్మణ్ నాయక్
- పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ. మార్చి 23వ తేదీన జరిగే ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం హనుమకొండ కాళోజి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్ అన్నారు. గూడూరు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ….
ఎస్ఎఫ్ఐ నాయకులు అనేక ఉద్యమాల్లో పాల్గొని అక్రమ కేసులను ఎదుర్కొంటున్నారన్నారు గతంలో ఎస్ఎఫ్ఐ లో పనిచేసిన వారందరూ సమ్మేళనంగా ఏర్పడడం శుభ పరిణామం అని తెలిపారు.
స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో ఏర్పడ్డ ఎస్ఎఫ్ఐ సంఘంలో విద్యార్థుల సమస్యల కోసం గూడూరులో ఎస్ఎఫ్ఐ నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎస్ఎఫ్ఐ మాజీ కార్యదర్శి బానోతు రాజన్ గూడూరు మండల మాజీ కార్యదర్శి మంగ మహేందర్, మండల మాజీ అధ్యక్షులు బట్టు సురేందర్ బోడ వీరన్న, వీరన్న అశోక్ జిల్లా కార్యదర్శి పుట్ట మధు సురేష్ పాల్గొన్నారు