
-సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినందున వినియోగదారులకు గ్యాస్ సిలెండర్ ధరలకు తగ్గించి ఆ ఫలితాలు అందించాలి..కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పంటగ్యాస్ సిలెండర్ పై 50రూపాయలు పెంచడం దారుణం..దీనివల్ల ఉజ్వల పథకం లబ్దిదారులు, సాధారణ వినియోగదారులతో పాటు, మహాలక్ష్మి స్కీం అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై కూడా పెద్ద భారం పడుతుంది..మోడీ ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలను ఉపసంహరించుకోవాలని, దీనికోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని సిపిఐ (ఎం) తెలంగాణ రాష్ట్రకమిటీ డిమాండ్ చేస్తున్నది.నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ తెస్తామని చెప్పిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం, అన్ని రకాల సరుకులు, వస్తువుల ధరలను విపరీతంగా పెంచింది.అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్యాస్ సిలిండర్ ధరలు 130.57 శాతం పెంచడంతో పాటు, సబ్సిడీని కూడా తగ్గించుకుంటూ వచ్చింది..
కార్పోరేట్ కంపెనీలకు లక్షల కోట్లు రాయితీలిస్తూ, రాష్ట్రంలోని వినియోగదారులపై సంవత్సరానికి 100 కోట్ల భారం మోపుతున్నది.
పెంచిన వంటగ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ..
ఏప్రిల్ 9, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టనుంది..అని సి పి ఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పేర్కొన్నారు