పేరుకు శ్రమశక్తి దోచి పెట్టేది యాజమాన్యాలకా
పేరుకు శ్రమశక్తి నీతి చట్టం దోచి పెట్టేది మాత్రం యాజమాన్యాలకా అని కేంద్ర ప్రభుత్వాన్ని ఖమ్మం నగర రెండో పట్టణ సీఐటీయూ కన్వీనర్ ఏనుగు మల్లికార్జునరెడ్డి ప్రశ్నించారు.శ్రమశక్తి నీతి కార్మికుల కోసమా యజమానుల కోసమా అని సీఐటీయూ సీనియర్ నేత ఎస్.వీరయ్య రాసి ముద్రించిన బుక్లెట్స్ ని నగరంలోని ఏఎంసీ కూరగాయల మార్కెట్లో కార్మికులకు బుదవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రెడ్డి ప్రసంగించారు.లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12 న జరగనున్న దేశ వ్యాప్త సమ్మెలో అందరూ పాల్గొనాలని,పని బంద్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.కార్మిక అడ్డాలలో ముమ్మర ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో: సిఐటియు నాయకులు బోడపట్ల సుదర్శన్, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.