రేగొండ గ్రామ సర్పంచ్ వారణాశి మౌనిక అజయ్
అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి-గ్రామ సర్పంచ్ వారణాశి మౌనిక అజయ్
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ
పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని రేగొండ గ్రామ సర్పంచ్ వారణాశి మౌనిక అజయ్ తెలిపారు.సోమవారం రేగొండ మండల కేంద్రంలోని నాల్గవ అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించి అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి పిల్లలు పూలతో స్వాగతం పలికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం చిన్నారులతో అన్నప్రాసన,అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రక్తహీనత నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.సర్పంచ్ మౌనిక అజయ్ మాట్లాడుతూ,గర్భిణీలు,బాలింతలు,చిన్నపిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నదని తెలిపారు.అందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ముఖ్యంగా పిల్లలకు అందించే కోడిగుడ్లు,పాలు,బాలామృతం వంటి పోషకాహారాన్ని నిరంతరం సక్రమంగా పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు.అంగన్వాడీ టీచర్ నామాల రజిత ఆధ్వర్యంలో గర్భిణీలు,బాలింతలకు వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్దండి నరేష్, గ్రామ కార్యదర్శి తుల్జారాణి,అంగన్వాడీ ఆశ శ్రీలత,ఏఎన్ఎం యాదలక్ష్మి,ఆశ వర్కర్లు హసీనా,సుభద్ర,రజిత,ఇంద్రాదేవి,కానిస్టేబుల్ డి. మౌనిక,వివో సంఘం అధ్యక్షురాలు సుమలత,రాధిక, బాలింతలు తదితరులు పాల్గొన్నారు