
ప్రజల ఆశీర్వాదమే మళ్లీ టికెట్ ఇప్పించింది
కోదాడ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలే మళ్లీ తనకు ఎమ్మెల్యేగా టికెట్ రావడానికి కారణమయ్యాయని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించిన తొలి జాబితాలో కోదాడ నియోజకవర్గానికి తిరిగి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్టు ఖరారు చేసారు. ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్యే
ఆనాడైనా… ఈనాడైనా ప్రజలు చూపించిన ఆదరణ.. అభిమానమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని, మరోసారి బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చి విజయదుంబికా ఎగరడానికి మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని అని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మజన్మల కృతజ్ఞతుడై ఉంటాన్నారు. కోదాడ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మళ్లీ కల్పించినందుకు ఆయన ఆనందభాష్పాలతో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కోదాడ నియోజకవర్గ ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నానన్నారు. నియోజకవర్గ ప్రజలతో తనకున్న బంధం పేగు బంధం కన్నా గొప్పది అన్నారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనని గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కోదాడ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటారని తెలిపారు. కాగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ టికెట్ ఖరారు కావడం పట్ల కోదాడ నియోజకవర్గ ప్రజల్లో ఆనందోత్సవాలు వ్యక్తం అవుతున్నాయి. పెద్ద ఎత్తున నియోజకవర్గం వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.